ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు అభివృద్ధి పనులకు MP గోడం నగేశ్, MLA పాయల్ శంకర్ సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీలోని ఖానాపూర్ చెరువు అభివృద్ధి పనులకై రూ. 3 కోట్ల 14 లక్షలు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, నాయకులు గంగాధర్ రావు, కౌన్సిలర్ విజయ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.