MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి మామిడి రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికి వచ్చిన మామిడికాయలు పూర్తిగా నేలరాలిపోయాయి. పంట కోసే దశలో నేల రాలిపోవడంతో తమకు తీవ్ర నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఎకరాల మేర పంట నష్టపోయామని తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.