హీరో ప్రదీప్ రంగనాథన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, ఆ సమయంలోనే స్క్రిప్టులు రాసి షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ‘కోమాలి’తో దర్శకుడిగా, ‘లవ్ టుడే’తో హీరోగా మారి స్టార్డమ్ దక్కించుకున్నాడు. నాడు కుటుంబాన్ని నమ్మించి కష్టపడిన ప్రదీప్, నేడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.25 కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు.