ప్రకాశం: జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడు గ్రామంలో సోమవారం శివాలయం నిర్మాణ పనులకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామస్థులు అందరు కలిసి రూ.2 కోట్లతో శివాలయం నిర్మాణ పనులు చేపట్టడంపై మంత్రి అభినందించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.