MDCL: రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో నల్లా కనెక్షన్లకు అక్రమంగా బిగించిన 7 విద్యుత్ మోటార్లను జలమండలి విజిలెన్స్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే మోటార్లు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి మోటార్లు బిగిస్తే రూ. 5వేలు జరిమానా & కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. నీటి సమస్యలు ఉంటే నేరుగా అధికారులను సంప్రదించాలన్నారు.