MBNR: నవాబ్‌పేట మండలం కారుకొండ గ్రామంలో విద్యార్థులు, యువత కోసం నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఆళ్ల సంతోషి భూపాల్ రెడ్డి భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఈ గ్రంథాలయం ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు.