AP: అఖండ గోదావరి పుష్కరాలు-2027 వచ్చే భక్తులకు ఎక్కడా చిన్న సమస్య కూడా రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్ర కందుల దుర్గేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేస్తోందన్నారు. పుష్కరాల పనుల కోసం కేంద్రం ఇప్పటికే రూ.94 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. త్వరలోనే అన్ని పనులు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.