TG: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రెండు పార్టీల ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేసినా.. రైతులకు సాగునీరు అందడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత పెరగడంతో బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటున్నాయన్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు రూ.వెయ్యి చెల్లించి వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు.