NGKL : వంగూరు మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కాలనీలో డ్రైనేజీ లేక మురుగు నీరు సీసీ రోడ్డుపై ప్రవహిస్తోంది. దీనివల్ల దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, బాటసారులు జారిపడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ నిర్మించాలని వృద్ధులు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులను కాలనీవాసులు విన్నవిస్తున్నారు.