NZB: అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.