AP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు బాగానే ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది. భాస్కర్రావు ఆరోగ్యం సరిగా లేదని, ఆసుపత్రిలో ఉన్నారని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. దయచేసి అలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని కోరింది.