మెగా ఫ్యామిలీ క్రేజ్ గురించి తెలిసిందే. ఒకరు కనిపిస్తేనే పూనకాలు వస్తాయి. మరి అంతా ఒకే మూవీలో ఉంటే? మెగాస్టార్ చిరంజీవి ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతోంది. బాబీ దర్శకత్వంలో రాబోయే మూవీలో మెగా హీరోలందరూ భాగం అయ్యే ఛాన్స్ ఉందట. అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ క్రేజీ గాసిప్ మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతోంది.