BDK: సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకంలో కొత్త టెండర్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని టీయూసీఐ నేతలు డిమాండ్ చేశారు. మణుగూరులో వినతిపత్రం అందజేసి గార్డుల ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విధానం వల్ల ఉద్యోగాలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.