MHBD: ఈనెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా బహిరంగ సభ ఉంటుందని, సభకు జిల్లా నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మహబూబాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విప్లవాత్మకమైన మార్పులతో జాగృతి పార్టీ ప్రజల ముందుకు రాబోతుందన్నారు.