HNK: GWMC 17వ డివిజన్ పరిధిలో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గద్దే బాబు పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తిచేయాలని, 17వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.