BDK: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేరళ మోడల్లో నిర్మితమవుతున్న ఈ భవనం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తుంది.