SRCL: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సిరిసిల్ల పట్టణంలోని బీ.వై నగర్‌కు చెందిన ముహమ్మద్ అర్బాస్ అనే యువకుడు ప్రతిభ కనబరచాడు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల్లో 1000 మార్కులకు గాను, 991 మార్కులు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతని విజయంతో కుటుంబంతో పాటు పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్బాస్ కృషి యువతకు ప్రేరణగా నిలుస్తూ, సిరిసిల్లకు గర్వకారణంగా మారింది.