RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి మల్కాపూర్ 12వ వార్డులో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ అత్తిలి మనిషా అనంతరెడ్డి , సొంత నిధులతో ఆదివారం కొత్త బోరు వేయించారు. ఈ సందర్బంగా వార్డు ప్రజలు కౌన్సిలర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమతా వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.