ATP: విడపనకల్లో కురుబల ఆరాధ్యదైవం విడపనకల్లప్ప స్వామి గుడికట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. సాంప్రదాయ ఉత్సవాలు భక్తిభావంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.