AP: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు మండలంలోని ఓ గ్రామంలో కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తల్లి భర్తతో గొడవపడి ఇద్దరు కుమార్తెలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. రెండ్రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో ఒంగోలు రిమ్స్‌లో చేర్పించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.