BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఓంకారిణి 973 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న బోళ్ల వెంకట రమణయ్య కుమార్తె అయిన ఓంకారిణి, చదువుపై దృష్టి పెట్టి ఈ ఘనత సాధించింది. రోజువారీ కష్టాలను తట్టుకుని, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో ఆమె ఈ విజయాన్ని అందుకుంది.