HNK: స్టడీ టూర్లో భాగంగా ఆలేరు, భువనగిరి, ఇతర వ్యవసాయ మార్కెట్లను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి, వైస్ ఛైర్మన్ మారేపల్లి రవీందర్, మార్కెట్ కమిటీ సభ్యులు సందర్శించారు. ఆయా మార్కెట్లలో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరు, తదితర అంశాలను అధికారులను వారు అడిగి తెలుసుకున్నారు. పరకాల మార్కెట్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఛైర్మన్ తెలిపారు.