NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని యుటిఎఫ్ మండల నాయకులు కలిశారు. నియోజకవర్గంలోని పలు మండలాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తుల కుట్టు విషయంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేకు యుటిఎఫ్ నాయకులు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు.