KMM: ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.