JN: దేవరుప్పుల మండలం లకవత్ తండా గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లకావత్ భాగ్య నాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ ధరకు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు.