SRD: సిర్గాపూర్ మండలం వంగ్దాల్ గ్రామానికి చెందిన లబ్ధిదారు ఆమ్రబాదే మచ్చెందర్ రావుకు మంజూరైన రూ.21,000 CMRFచెక్కును ఎమ్మెల్సీ అంజిరెడ్డి అందజేశారు. ఖేడ్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ పాటిల్‌తో కలిసి ఆయన ఈ చెక్కును లబ్ధిదారునికి అందించారు. ఆపద కాలంలో పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.