KMR: లింగంపేట్ మండలం నల్లమడుగు వాగు మత్తడికి గండి పడింది. ఈ కాలువ ద్వారా సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గండి పడటం వల్ల మత్తడి నుంచి నీరు దిగువకు వెళ్లిపోయి నిల్వ ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఈ మత్తడి ద్వారా నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు పెరిగి వేసవి పంటలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ మత్తడి గండిని పూడ్చాలని కోరారు.