WGL: సమాజంలో ఆడపిల్లల పట్ల పెరుగుతున్న వివక్షను, మూఢనమ్మకాలను వర్ధన్నపేట MLA నాగరాజు తీవ్రంగా ఖండించారు. వర్ధన్నపేటలో ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బిడ్డ పుట్టుకలో తల్లి పాత్ర కేవలం జన్మనివ్వడం మాత్రమేనని, శాస్త్రీయంగా బిడ్డ లింగ నిర్ధారణ పురుషుడి క్రోమోజోములపైనే ఆధారపడి ఉంటుందని వివరించారు.