MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి స్థానిక సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… చదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పు సాధ్యమని పూలే నమ్మరని, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.