పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (66*), ట్రావిస్ హెడ్ (31*) బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా SRH రికార్డు సృష్టించింది.