WNP: DCA, కెమిస్ట్ అసోసియేషన్ సదస్సులో డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మి, DMHO సాయినాథ్ రెడ్డి, DSP హరిశ్చంద్ర రెడ్డి పాల్గొన్నారు. అలవాటుగా మారే మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరాదని డ్రగ్ ఇన్స్పెక్టర్ కెమిస్టులను ఆదేశించారు. యువత మత్తుకు బానిస కాకుండా ఫార్మసిస్టులు నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.