GDWL: మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో బీసీలకు చట్టసభల్లో 52 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఐక్యంగా పోరాడాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు జమ్మిచేడు కార్తీక్ పిలుపునిచ్చారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషిని కొనియాడారు.