పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRHకు శశాంక్ సింగ్ డబుల్ షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), ట్రావిస్ హెడ్ (38)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 122 పరుగుల వద్ద సన్‌రైజర్స్ రెండో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం 9 ఓవర్లకు SRH స్కోరు 123/2. క్రీజ్‌లో క్లాసెన్ (1*), ఇషాన్ కిషన్ (1*) ఉన్నారు.