మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై చేసిన సెటైరికల్ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేందుకు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా నిరాకరించాడు. అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరైన ఆయన, తన కామెడీ షోలోని విమర్శల పట్ల పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు. మనస్ఫూర్తిగా లేని క్షమాపణలు చెప్పడం కళాకారుల భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తుందని కమ్రా ఈ సందర్భంగా తేల్చి చెప్పాడు.