MLG: జిల్లాలో గ్యాస్ కొరత లేదని కలెక్టర్ దివాకర్ తెలిపారు. సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రజలు అపోహలు పడవద్దన్నారు. లక్ష్మీ హెచ్పీ గ్యాస్ గోదాంను సోమవారం తనిఖీ చేసి స్టాక్ పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుకార్లు నమ్మొద్దని, సరఫరా నిరంతరం పర్యవేక్షణలో ఉందన్నారు.