HNK: పరకాల పట్టణంలోని రాజుపేటలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.