MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సర్పంచ్ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.