NRML: తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఏర్పడిందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరుల ఆశయాల సాధనకు కృషి చేయాలని, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.