SRPT: ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేనారెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని 11వ వార్డు రాయనిగూడెం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కౌన్సిలర్ ఎల్గురి ఇందిరా ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.