AP: SIR సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని TDP నేతలకు CM చంద్రబాబు సూచించారు. TDP ఓట్లు తీసేసి.. తమ ఓట్లు పెట్టేలా కుట్రలకు YCP వెనుకాడదని హెచ్చరించారు. జనసేన, BJPతో కలిసి సమన్వయంతో SIRని పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా TDP ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. TDP MLAలు లేని చోట్ల జనసేన, BJP MLAలతో పని చేయాలని TDP నేతలకు చంద్రబాబు సూచించారు.