PLD: నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించకుండా పోవడం కలకలం రేపింది. గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని కొందరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై గ్రామంలో ఆందోళన నెలకొంది.