NRPT: మద్దూర్ పట్టణంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 10 ఇందిరమ్మ ఇండ్లను చైర్మన్ డిల్లీకర్ సరస్వతి జనార్దన్ ప్రారంభించారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మున్సిపల్ చైర్మన్ డిల్లీకర్ సరస్వతి జనార్దన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సి. శ్రీకాంత్, కో-ఆప్షన్ సభ్యురాలు కునే విజయలక్ష్మి సంజీవ్, వెంకట్రాములు, రియాజ్ పాల్గొన్నారు.