SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. బంకులకు వెళ్లిన ప్రజలకు “స్టాక్ లేదు” అనే సమాధానం తప్ప మరొకటి జవాబు రావడం లేదు. అయితే ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్లో మాత్రం ఇంధనం లభ్యత పెరిగి, అది కూడా అధిక ధరలకు అమ్ముడవుతున్న పరిస్థితి స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.