BDK: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం గ్రామంలోని సర్వీస్ వైరును 11 కేవీ విద్యుత్ లైన్లకు తగిలిస్తుండగా ఎండి ఇమ్రాన్ అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.