నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో NSUI 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. విద్యార్థుల గళాన్ని బలోపేతం చేయడంతో పాటు, వారి చదువులకు సహాయం అందించడం గర్వంగా ఉందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లి అంజన్న యాదవ్, బైరు ప్రసాద్ గౌడ్, గోపగోని సాయి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.