సూర్యాపేట: పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారం, కోర్టు విధుల్లో సమన్వయంపై జిల్లా ఎస్పీ కె.నరసింహ ఈరోజు సమీక్ష నిర్వహించారు. నిందితులకు శిక్షలు పడేలా సాక్షులను సకాలంలో హాజరుపరచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచి, లోక్ అదాలత్ ద్వారా కేసుల రాజీకి కృషి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు.
Tags :