వనపర్తిలోని భగత్ సింగ్ నగర్లో ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని కేతేపల్లి మాజీ వార్డు సభ్యుడు, CPI నేత కిష్టయ్య(97) ప్రారంభించారు. రూ.500 విరాళం అందజేసి, పేదల పక్షాన CPI పోరాడుతోందన్నారు. ఏప్రిల్ 10 వరకు ఇంటింటికి CPI ప్రోగ్రాంలో భాగంగా పోరాటాలను వివరిస్తామని, సమస్యలు తెలుసుకుంటామని CPI టౌన్ కార్య దర్శి రమేష్ చెప్పారు. కార్యక్రమంలో కళావతమ్మ, జయమ్మ పాల్గొన్నారు.