NTR: విజయవాడ రూరల్ రామవరప్పాడు రింగ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ లక్ష్మిశా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.