ATP: విజయవాడలోని రాష్ట్ర గ్రంథాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ పాల్గొన్నారు. అనంతరం మంగళగిరిలోని అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని సందర్శించి ఈ-బుక్స్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సిస్టమ్స్ పనితీరును పరిశీలించారు. డిజిటల్ లైబ్రరీ విధానాన్ని జిల్లాలోనూ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.