SRPT: మునగాల మండలం గణపవరంలో వరి కొయ్యలు కాల్చడం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. కొయ్యలను కాల్చడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతుందని హెచ్చరించారు. వాటిని తగులబెట్టకుండా భూమిలోనే కలియదున్ని సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలని సూచించారు.